![]() |
![]() |

స్టార్ మాలో ప్రసారమవుతున్న 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఎపిసోడ్ -72 లోకి అడుగు పెట్టింది. కాగా శనివారం జరిగిన ఎపిసోడ్ లో.. మనం పూజలో కూర్చొని వ్రతం చేస్తామని భవాని అత్తయ్యకి మాటిచ్చాను అని మురారితో చెప్తుంది కృష్ణ. "ఏంటీ కృష్ణ.. ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతావు. ఇంట్లో ఏ విషయమైనా అమ్మ, పెద్దమ్మ చూసుకుంటారు. నువ్వు ఎందుకు అన్నింటిని పట్టించుకుంటున్నావ్" అని మురారి అంటాడు. ఎలాగైనా పూజలో కూర్చోవాలని మురారిని ఒప్పిస్తుంది కృష్ణ. నీతో కూర్చుంటే ముకుందకి ఇష్టం ఉండదని మనసులో అనుకుంటాడు మురారి.
ముకుంద అమ్మవారి చీరని తీసి దాచిపెడుతుంది. ఇక పూజకి అంత సిద్దమై అందరూ కృష్ణ, మురారిల కోసం ఎదురు చూస్తుండగా వాళ్ళు వస్తారు. అయితే కృష్ణ అమ్మవారి చీర కట్టుకోకుండా వేరే చీర కట్టుకోవడంతో.. "అమ్మవారి చీర కట్టుకునే కదా పూజ లో కూర్చోమని చెప్పింది.. ఇప్పుడేంటి ఇలా చేసావ్" అని అంటుంది భవాని. "చీర ఏంటీ అత్తయ్యా.. నాకు ఏ చీర ఇవ్వలేదు" అని కృష్ణ అనగానే.. "రేవతి నువ్వు కృష్ణ కి చీర ఇవ్వలేదా" అని అడుగుతుంది భవాని. దానికి రేవతి.. "పూజకి అన్నీ సిద్ధం చేసే హడావిడిలో ఇవ్వడం మర్చిపోయా" అంటుంది. అలేఖ్య వెళ్లి చీరని తీసుకు రావడానికి వెళ్లేసరికి.. అక్కడ లేకపోవడంతో చీర లేదని భవానీతో చెప్తుంది. నేను తీసాక అక్కడ చీర ఎలా ఉంటుందని ముకుంద మనసులో అనుకుంటుంది.
అంతలోనే నందు చీర తీసుకొని వస్తుంది. ఎక్కడ నుండి తెచ్చావే ఈ చీర అని ఇంట్లో వాళ్ళు అడగడంతో ముకుంద గదిలోకి ఆడు కోవడానికి వెళ్తే.. అక్కడ ఈ చీర కనిపించింది అని చెప్తుంది నందు. ఆ చీర ముకుంద గదిలో ఏంటని అనుమానపడుతుండగా.. నా భర్త గురించి పూజ చేస్తుండగా నేను ఇలా చేస్తానా అని అంటుంది ముకుంద. ఇక కృష్ణ నువ్వు వెళ్లి చీర కట్టుకొని రా అని భవాని అనగానే కృష్ణ వెళ్లి చీర కట్టుకొని వస్తుంది. ఆ తర్వాత పూజలో కృష్ణ, మురారిలు పాల్గొంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |